రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం. కానీ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఆ స్టేజ్ ను ధాటి వ్యక్తిగత విమర్శలవరకు వెళ్ళింది. ఎప్పుడూ ట్విట్టర్ వేదికగా మాట్లాడే విజయ సాయిరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ సోదాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదో చెప్పాలంటూ ప్రశ్నించారు. వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976 లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకెళ్ల నుంచి బయటపడలేక పోతున్నారు. జనం నవ్వుకుంటారన్న ఇంగితం లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడు. పిఎస్ శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదట.పవన్ కళ్యాణ్ కట్టప్పను మించిపోతున్నాడని విమర్శించారు.
చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయింది. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టిందంటూ ఆరోపించారు.