ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ఇండ్ల పై ఐటీ రైడ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట్రంలో తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై మాజీ పీఏ పై జరుగుతున్న రైడ్స్ పై చంద్రబాబు స్పందించకుండా నోరువిప్పటం లేదని, నిప్పుకణికల్లాంటి వాళ్ళపై ఐటీ దాడులు ఏంటని చంద్రబాబు నిలదీయాలంటూ ఎద్దేవా చేశారు. కియా లేచిపోతోందని ఫేక్ వార్తలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు.
మాజీ పీఏతోపాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరువిప్పడం లేదు. నిప్పు కణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని ఐటీ శాఖను నిలదీయాలి. రెండ్రోజులుగా కిక్కురుమనకుండా, కియా లేచిపోతోందని ఫేక్ వార్తలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 8, 2020