ఎమ్మార్వో విజయారెడ్డి హత్య సందర్భంలో మరో ప్రాణం బలైపోయింది. విజయారెడ్డి అరుపులతో అలర్టయిన డ్రైవర్ గుర్నాథం… ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. చివరి వరకు మంటలు ఆర్పేందుకు తన ప్రాణాలను తెగించి మరీ ప్రయత్నించాడు. కానీ అప్పటికే విజయారెడ్డికి మంటలు ఎగిసిపడుతుండటంతో ఏమీ చేయలేకపోయాడు.
కానీ ఎమ్మార్వోను కాపాడే ప్రయత్నంలో… తనకు కూడా మంటలు అంటుకున్నాయి. తనకు మంటలు అంటుకుంటున్నా… తాను ప్రయత్నిస్తూనే ఉండటంతో, తనకూ గాయాలు కావటంతో… అక్కడున్న సిబ్బంది డీర్డీఓ అపోలో తరలించి, చికిత్స అందించారు. గుర్నాథం కూడా 80శాతం కాలిపోవటంతో… మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. కొద్దిసేపటి క్రితం గుర్నాథం కూడా చనిపోయినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దీంతో… అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఎమ్మార్వో విజయారెడ్డి పాశవిక హత్య, ఆమెను కాపాడే ప్రయత్నంలో డ్రైవర్ కూడా మరణించటం అందరినీ కలిచివేస్తుంది.