తెలంగాణ వచ్చి నా కుటుంబం బలైపోయింది - Tolivelugu

తెలంగాణ వచ్చి నా కుటుంబం బలైపోయింది

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయా రెడ్డి హత్యపై సోషల్ మీడియా లో రకరకాలు గా ప్రచారం జరుగుతోంది.ఈ నేపధ్యంలో తొలి వెలుగు తో విజయా రెడ్డి భర్త సుభాష్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ వచ్చాక నా కుటుంబం బలైపోయిందని కన్నీరు మున్నీరయ్యారు. మీడియాలో మా కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయా రెడ్డి నిబద్దతతో పనిచేసిన ఉద్యోగిని అని చెప్పారు. మాది ముందు నుండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని, మా మీద అవినీతి ఆరోపణలు చేయడం దారుణమన్నారు.

హత్య చేసిన సురేష్ వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియా శక్తుల కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నిస్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని వేడుకున్నారు. సుభాష్ రెడ్డి తొలి వెలుగు పూర్తి ఇంటర్వ్యూ మరి కొద్దిసేపట్లో…

Share on facebook
Share on twitter
Share on whatsapp