నేచురల్ స్టార్ నాని హీరోగా 30వ సినిమా లేటెస్ట్ గా ఎనౌన్స్ మెంట్ వచ్చింది.ఈ సినిమాలో సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కోసం ఏకంగా మృణాల్ ఠాకూర్ ఎన్.టి.ఆర్ సినిమానే వదిలేసుకుందని టాక్.
ఎన్టీఆర్ 30వ సినిమాలో మృణాల్ ఠాకూర్ ని తీసుకోవాలని అనుకున్నారు.కానీ ఆ టైం లోనే నాని సినిమా ఆఫర్ వచ్చిందట.తారక్ సినిమాలో పాత్ర కన్నా నాని సినిమాలో పాత్ర వెయిట్ ఎక్కువ ఉందని అనిపించడంతో మృణాల్ స్టార్ సినిమా అయినా సరే తారక్ సినిమాకు నో చెప్పిందట.
అదే క్రమంలో నాని సినిమాలో పాత్ర బాగా నచ్చడంతో తను రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ ని తగ్గించుకుని మరీ ఈ సినిమా చేస్తానని చెప్పిందట. మృణాల్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి అందరూ ప్రశ్నించగా.. ప్రయోగాలతో ప్రయాణం చేయడమే నాకు ఇష్టమంటూ ఈ భామ సమాధానమిచ్చింది. మరి మృణాల్ తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.
సీతారామం తర్వాత మృణాల్ తెలుగులో చేస్తున్న ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది.ఆ సినిమాతో ఆమెకు తెలుగులో ఫ్యాన్స్ ఏర్పడ్డారు.మరి నానితో మృణాల్ ఎలాంటి క్రేజీ సినిమాతో వస్తుందో చూడాలి.మృణాల్ ఎంపిక కరెక్టా కాదా తారక్ సినిమా కాదనుకుని మరీ నానితో జత కడుతున్న ఆమెకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.