దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ఎంతపెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుల్కర్ కి జంటగా మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించింది. ఈ చిత్రం విజయం సాధించడంతో అమ్మడికి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులోనే కాకుండా పలు భాషల్లో అవకాశాలను సంపాదించుకుంటుంది. ఇకపోతే మృణాల్ సినీ కెరీర్ ప్రారంభంలో అంత సాఫీగా సాగలేదు.
ఇండస్ట్రీలోకి రావడానికి ముందు మృణాల్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను నటన రంగం వైపునకు వెళ్తానన్నప్పుడు తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఓ సందర్భంలో మృణాల్ చెప్పుకొచ్చింది.
మృణాల్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. తాను సినిమాల్లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదని చెప్పింది. వాళ్లది మరాఠి ఫ్యామిలీ అని.. అమ్మానాన్నకు సినిమా ఇండస్ట్రీ గురించి ఏ మాత్రం తెలియదంది.
అందుకే సినిమాల్లోకి వస్తానంటే వారు చాలా భయపడిపోయారని చెప్పింది. సీరియల్స్ లో నటిస్తూ అక్కడ గుర్తింపు తెచ్చుకుని మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు వివరించింది.
తాను ఎంచుకున్న పాత్రలు సినిమాలే మంచి పేరు తీసుకొచ్చాయని మృణాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తనను చూసి పేరెంట్స్ గర్వపడుతున్నారంటే గర్వంగా చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం మృణాల్ తెలుగులో నాని 30 వ సినిమాలో నటిస్తోంది. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
మలయాళ సినిమా హృదయం లాంటి సూపర్ హిట్‌కు సంగీతాన్ని సమకూర్చిన హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ఐఎస్‌సీ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.