మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మిగా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ భామకు టాలీవుడ్ లో అవకాశాలు. వెల్లువెత్తుతున్నాయని టాక్.ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది ఈ భామ.
నాని నటిస్తోన్న 30వ సినిమా ఇది.ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు.ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ కు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది .మృణాల్ ఈ మెయిల్ హ్యాక్ అయ్యిందట.. అంతే! అక్కడి నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్ షురూ అయ్యాయట.
ఏ మేరకు ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. ‘నా ఈ-మెయిల్ ఖాతా హ్యాక్ చేశారు. దీని ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా వ్యక్తిగత సమాచారం, నా సినిమా స్క్రిప్ట్‌లన్నీ అందులోనే ఉన్నాయి.’ అంటూ వీడియో షేర్ చేసింది మృణాల్.
అయితే దీనిలో నిజం లేదని తెలుస్తోంది. అయితే ఆమె ఈ వీడియో రానా నాయుడు సిరీస్ ప్రమోషన్స్ కోసం చేసింది.
ఇలా మీ ఈమెయిల్ హ్యాక్ అయితే దాని నుంచి ఎలా బయట పడాలో తెలియాలంటే రానా నాయుడు చూడండి అంటూ చెప్పుకొచ్చింది మృణాల్. వెంకటేష్, రానా నటించిన రామానాయుడు సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.