బుల్లితెర నుంచి వెండి తెరకు పరిచయమైన మరాఠా ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. మృణాల్ ఈ సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మరిచిపోలేని అనుభూతిని అందించింది.
కాగా ఇప్పుడు సినీ అవకాశాలు లేక ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటో షూట్లు చేస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. ‘సీతారామం’ చూసిన ప్రతి ఒక్కరూ ఈ స్టార్ హీరోయిన్ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మృణాల్ తనంతట తానే తన గురించి చాలా విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇదే ఇంటర్వ్యూలో తాను చనిపోవాలని కూడా అనుకున్నట్లు చెప్పింది.మృణాల్ మాట్లాడుతూ.. “టీనేజ్‌లో ఉన్న సమయంలోనే నేను మీడియాలోకి అడుగు పెడదామనుకున్నా. అందుకే పేరెంట్స్‌ను ఒప్పించి మరీ మీడియా కోర్సులో జాయిన్ అయ్యాను. బ్యాంకు ఉద్యోగి అయిన మా నాన్న ముంబై నుంచి వేరే చోటికి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. దాంతో ఇక్కడ నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండిపోయాను. ఆ సమయంలో కుటుంబానికి దూరంగా ఉంటున్నాం అనే ఫీలింగ్ నన్ను ఎంతో బాధ పెట్టింది. అదే సమయంలో మీడియా నాకు సెట్ అవ్వదనే భావన వచ్చేసింది. అప్పుడే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా ఎక్కువగా వచ్చాయి. ఒక రోజు లోకల్ ట్రైన్ నుంచి కిందికి దూకేసి సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించింది” అని చెప్పుకొచ్చింది.
సూసైడ్ చేసుకుంటే తన పేరెంట్స్ చాలా బాధపడతారని .. వారిని బాధించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని.. అందుకే ఆత్మహత్య చేసుకోకుండా ఉన్నానని చెప్పింది. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనే కోరిక పుట్టిందట. అందుకు మోడలింగ్ ప్రారంభించింది. ఆపై సీరియళ్లలో ఆఫర్స్ అందిపుచ్చుకుంది. సీరియళ్లలో చేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినా ఎక్కువగా అవమానాలే ఎదురయ్యేవట.
సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో అవకాశం వచ్చిందని కానీ అది చేజారిపోయిందని ఈ ముద్దుగుమ్మ వాపోతూ చెప్పుకొచ్చింది. ప్రయత్నించగా ప్రయత్నించగా ఆఖరికి ‘లవ్ సోనియా’ సినిమాతో తనకు గుర్తింపు లభించిందట. ఆ తర్వాత సినీ అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చాయని ఆమె చెప్పింది.