టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ధోని మరో అరుదైన ఘనత సాధించారు. టీ20 క్రికెట్ లో 350 మ్యాచ్ లు ఆడిన రెండవ ఇండియన్ క్రికెటర్ గా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు.
ఐపీఎల్-2022 సీజన్ లో 11వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆడటం ద్వారా ఆయన ఈ ఘనత సాధించారు. ధోని కన్నా ముందు ఈ రికార్డును ఇండియన్, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అందుకున్నారు.
ఇప్పటి వరకు ఇండియా నుంచి అత్యధిక టీ 20 మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(372) మొదటి స్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో ధోనీ, సురేశ్ రైనాలు(329). విరాట్ కోహ్లీ(328) ఉన్నారు.
అంతకు ముందు లక్నో సూపర్ జాయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ పొట్టి క్రికెట్ లో 7000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇందులో ఆయన 28 హాఫ్ సెంచరీలు చేశారు.