సరదా సరదాగా ఉండే టీంఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీ అందర్నీ కడుపుబ్బా నవ్వించాడు. చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ధోనీ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. పెళ్లికి ముందు మగాళ్లు అంతా సింహాలే కానీ… అంటూ వివాహా బంధంపై కామెంట్ చేశారు.
రైలు టికెట్లపై 50శాతం డిస్కౌంట్
భార్యలను ఆనందంగా ఉంచగలిగితేనే భర్తలు ఆనందంగా ఉండేది… నా వరకు అయితే నేను ఐడియల్ హస్బెండ్‌నే కన్నా ఎక్కువే… ఎందుకుంటే నా భార్య ఏం చేయాలనుకున్నా తోడ్పాటు అందిస్తా అని తెలిపారు. అప్పుడు అందరం ఆనందంగా ఉండొచ్చని తెలిపారు.
ఈ సందర్భంలోనే పెళ్లికి ముందు మగాళ్లు అంతా సింహాలే… ఆ తర్వాతే కథ మారిపోతుంది అంటూ కామెంట్ చేయటం ఇప్పుడు వైరల్ అవుతోంది.
దాదాపు నాలుగు నెలలుగా మైదానానికి దూరంగా ఉన్న ధోనీ… ఆ మధ్య సైన్యంలో డ్యూటీ కూడా చేశారు. ప్రస్తుతం తన లీజర్ టైంను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు ధోనీ.