ధోనీ ఫన్ టైం

భారత క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌ నుంచి విశ్రాంతి లభించడంతో ఈ విలువైన సమయాన్ని ఫ్యామిలీ, తన పెట్ డాగ్స్ తో ఆస్వాదిస్తున్నాడు. తన వైఫ్ సాక్షి, డాటర్ జీవాతో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను తన అభిమానులతో పంచుకున్నాడు. వీటికి సంబంధించిన ఓ వీడియోను ధోని తన ఇన్‌స్టాగ్రాంలో ‘ఫన్‌ టైం విత్‌ ఫ్యామిలీ’ అనే క్యాఫ్షన్‌తో పంచుకున్నాడు. ధోనీ పోస్టు చేసిన ఈ వీడియోకు ఇప్పటికే ఒక మిలియన్‌ వ్యూస్‌ దాటేశాయి. గతంలో కూడా తన పెంపుడు కుక్కలతో హర్డిల్స్ చేయిస్తున్న వీడియోని కూడా ధోనీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ మధ్య తరచూ అప్ డేట్స్ ఇస్తోన్న ధోనీ ఐపీఎల్‌ నిర్వాహకులు సోమవారం విడుదల చేసిన ప్రచార గీతాన్ని కూడా తన ట్విటర్‌లో పంచుకున్నాడు.

 

View this post on Instagram

Fun time with the family

A post shared by M S Dhoni (@mahi7781) on

View this post on Instagram

Attack on besan ka laddoo

A post shared by M S Dhoni (@mahi7781) on