టీంఇండియా విజయాలను రెట్టింపు చేస్తూ… దూకుడు నేర్పిన లెజెండరీ క్రికెటర్ ధోనీ వన్డేలకు గుడ్ బై చెప్పబోతున్నారు. ఇప్పటికే టెస్ట్‌లకు మహీ గుడ్‌బై చెప్పగా ఇప్పుడు వన్డేల నుండి కూడా తప్పుకోబోతున్నారు. ఇక కేవలం టి20 ఫార్మాట్‌కే పరిమితం కాబోతున్నాడు మహేంద్రసింగ్ ధోనీ. మరికొన్నేళ్ల పాటు ఐపీఎల్‌లోనూ కంటిన్యూ కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని ప్రకటించాడు టీంఇండియా కోచ్ రవిశాస్త్రి. జట్టుకు అతను ఎప్పుడూ భారం కాడని, ధోనీకి ఐపీఎల్ ఫామ్ కీలకం కాబోతుందని అభిప్రాయపడ్డారు. నేను ధోనీతో ప్రత్యేకంగా మాట్లాడా… త్వరలోనే ధోనీ వన్డేలకు వీడ్కోలు ప్రకటించబోతున్నారని రవిశాస్త్రి సంచలన ప్రకటన చేశాడు. అయితే ఐపీఎల్‌లో ధోనీ ఆటతీరు బాగుంటే టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశాడు. అయితే మహి ఫిట్‌నెస్ అద్భుతమని ప్రశంసించాడు.
మహేష్ టీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..?
పోసాని వర్సెస్ పృథ్వీ- అంతా జగన్ స్క్రిప్ట్ ?