రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ ధనవతుల జాబితాలో ఒకరు. ముంబైలోని ఈయన ఇంటి గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే, అంబానీ ప్రయాణానికి ఉపయోగించేందుకు అత్యంత ఖరీదైన కార్లు, వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. వాటి వివరాలు చూస్తే..
ముఖేష్ అంబానీకి చెందిన విలాసవంతమైన నివాసం ఎత్తు 173.13 మీటర్లు ఉంది. ఇందులో మొత్తం 27 నివాసాలు. ప్రతి నివాసం ఎత్తు మన మామూలు ఇళ్ల ఎత్తుకు మూడు రెట్లు అధికం. ఇది మొత్తం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అంబానీ కార్లను విపరీతంగా ప్రేమిస్తాడు. ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్న కార్లన్నీ ఇంటిలో నిండిపోయి.. ఒక లగ్జరీ కార్ల షోరూమ్ తలపిస్తోంది.
ముఖేష్ ఎప్పుడు ఏ కారులో వెళ్లాలో ముందుగా చెప్పరు. అందుకే అన్ని కార్లను సిద్ధం చేసి ఉంచుతారు. అందుకోసం దాదాపుగా ఆరు టెర్మినల్స్ లో కార్లను నిలిపి ఉంచుతారు. అందులో దాదాపుగా 168 కార్లు ఉన్నట్లు సమాచారం. ఇది చూడటానికి సర్వీసింగ్ కోసం వచ్చిన గ్యారేజీని తలపిస్తుంది.
అంబానీ 5 అత్యంత ఖరీదైన కార్లు ఇవే!
రోల్స్ రాయిస్ కల్లినన్..
ముఖేష్ అంబానీకి ప్రపంచం నలుమూలల నుంచి లగ్జరీ కార్లు ఉన్నాయి. దాదాపు రూ.13 కోట్ల ఖరీదు చేసే రోల్స్ రాయిస్ కల్లినన్ కారును కూడా కలిగి ఉన్నారు. దీన్ని గతేడాది(2022) ప్రారంభంలో కొనుగోలు చేశారు.
రోల్స్ రాయిస్ ఫాంటమ్..
ముఖేష్ కు చాలా కాలంగా రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూపే ఉంది. దీని ఖరీదు కూడా దాదాపు రూ.13 కోట్లు. ఈ కారు చాలా విలాసవంతమైంది. లుక్స్, ఫీచర్స్, సౌకర్యాలకు ఎటువంటి కొరత లేదు.
మెర్సిడెస్ మేబ్యాక్ బెంజ్ ఎస్660 గార్డ్..
అంబానీకి ఖరీదైన, లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలో చాలా శక్తివంతమైన, అల్ట్రా లగ్జరీ మెర్సిడెస్ కార్లు ఉన్నాయి. వీటిలో మేబ్యాక్ బెంజ్ ఎస్660 గార్డ్ కూడా ఉంది. దీని విలువ రూ.10 కోట్ల కంటే ఎక్కువే.
బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ సెక్యూరిటీ (ఆర్మర్డ్)..
ముఖేష్ కి బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఉన్నాయి. బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ సెక్యూరిటీ (ఆర్మర్డ్) ధర రూ.8.50 కోట్లుగా చెబుతున్నారు. ఈ కారు బుల్లెట్ ప్రూఫ్, భద్రత పరంగా చాలా బాగుంటుంది.
ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్..
ముఖేష్ అంబానీ ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్ కలిగి ఉన్నారు. ఇది హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు. మొదట 2019లో ప్రవేశపెట్టబడింది. హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన తొలి ప్రొడక్షన్ ఫెరారీ కారు ఇదే. దీని ఖరీదు దాదాపు రూ.7.50 కోట్లు.
ఫాల్కన్ 900 ఇఎక్స్ ఇది ఫ్రాన్స్ ఏవియేషన్ కు చెందిన ప్రసిద్ద విమానం. వ్యక్తిగత వినియోగాలకు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సంస్థ వివిధ రకాల మోడల్స్‌లో వీటిని అందిస్తోంది. అందులో ముఖేష్ అంబానీ ఫాల్కన్ 900 ఇఎక్స్ మోడల్ ప్లైట్‌ను కొనుగోలు చేసాడు. ఇది నిరంతరంగా 8,340 కిలో మీటర్లు దూరం ప్రయాణం చేస్తుంది. ఇందులో చిన్నచిన్న మీటింగ్‌లను కూడా నిర్వహించుకోవచ్చు. తాత్కాలిక ఆఫీస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. అందు కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. అంతే కాకుండా ఇందులో శాటిలైట్ టీవీ, వైర్‌లెస్ కమ్యూనికేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు ఉన్నాయి.
బోయింగ్ బిజినెస్ జెట్-2 ఈ విమానంలో హోటల్ లో ఉన్న విధంగా ఫీచర్లు ఉన్నాయి. ముఖేష్ అంబానీ అవసరాలను బట్టి దీనిని 78 రకాల మోడ్‌లలో ఉపయోగించుకోవచ్చు. ఈ విమానం ధర కేవలం 70 మిలియన్ డాలర్లు మాత్రమే అయితే ఇందులో గల ఇంటీరియర్‌ను తనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దడానికి అదనంగా 30 మిలియన్ అమెరికన్ డాలర్లను ఖర్చు పెట్టారు. ఇందులో సంప్రదింపుల కోసం, సమావేశాల కోసం, అధికారిక అవసరాల కోసం ప్రత్యేకంగా ఇంటీరియర్‌ను డిజైన్ చేయించాడు. అంతే కాకుండా ఇందులో పడక గదిని కూడా ఏర్పాటు చేయించుకున్నాడు. అయితే ఈ విమానం ఒక గంట పాటు ప్రయాణించిందంటే దాదాపుగా 13,00 డాలర్లు ఖర్చు అవుతుంది.
ముఖేష్ అంబానీ ఎయిర్‌బస్ 319 కార్పోరేట్ జెట్ ఫ్లైట్‌ను తన భార్య నీతా అంబానికి బహుకరించాడు. దీని ధర 242 కోట్ల రుపాయలు. ఇంది ఎంతో విశాలమైనది. దీనిని పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడే విధంగా స్పెషల్‌గా రూపొందించారు. నీతా అంబానీ బహుమతిగా పొందిన ఎయిర్‌బస్ 319 విమానం నిర్విరామంగా 11,100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 1,012 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. ప్రపంచ వ్యాప్తంగా గల అతి ఉత్తమమైన వ్యక్తిగత విమానాలలో ఇది చోటు సంపాదించింది కూడా.
లగ్జరీ యాచ్:
ముఖేష్ అంబాని ఈ లగ్జరీ యాచ్ కోసం దాదాపుగా 20 మిలియన్ అమెరికన్ డాలర్లును ఖర్చు పెట్టాడు. ముఖేష్ అంబానికి చెందిన ఈ అత్యంత ఖరీదైన యాచ్‌లో ఎన్నో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. అందులో స్విమ్మింగ్ ఫూల్, హెలిప్యాడ్, మసాజ్ రూమ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ లగ్జరీ బోటులో దాదాపుగా 12 మంది అథిదులకు మర్యాదలు చేయవచ్చు, ఇందులో 20 మంది పని వారు ఉంటారు, ఈ లగ్జరీ యాచ్ 80 శాతం వరకు కరెంట్‌తో పని చేస్తుంది. అందుకోసం సోలార్ పవర్‌ను ఉపయోగించుకుంటుంది.