టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. ఆయన తనయుడు ఆకాష్ అంబానీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. దీనికి బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖేష్ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయగా , కొత్త డైరెక్టర్లుగా లుగా రమీందర్ సింగ్, కేవీ చౌదరిగా కొనసాగనున్నారు. ఇందుకుగాను షేర్ హోల్డర్స్ అంగీకారం తెలపాల్సి ఉంది. వీరి పదవి కాలం ఐదు సంవత్సరాలు.
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా లుగా పంకజ్ మోహన్ పవార్ నియామకాన్ని బోర్డు ఆమోదించింది. గతంలోనే ముఖేష్ తన పిల్లలు బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. తన తండ్రి,రిలయన్స్ వ్యవస్థాపకుడైన ధీరుభాయ్ అంబానీ దేశాభివృద్ధికి దోహదపడ్డారని.. తన పిల్లలు కూడా అదే విధంగా వ్యవహరిస్తారన్నారు.
Advertisements
ఆసియాలోనే అత్యంత సంపన్నులో ఒకరైన ముఖేష్ అంబానీకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 2002లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ముఖేష్ బాధ్యతలు తీసుకున్నారు. తన సామ్రాజ్యాన్నివారసుల చేతుల్లోకి వ్యాపార పగ్గాలు అప్పగిస్తారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. వారుసులను నేరుగా రంగంలోకి దింపి వాళ్లు వ్యాపారం ఎలా నడుపుతారో చూడాలని ముఖేష్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే నాయకత్వాన్ని బదిలీ చేస్తున్నట్లు సమాచారం.