రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేష్, నీతా అంబానీల చిన్నకుమారుడు అనంత్ అంబానీ ఎంగేజ్ మెంట్ రాధిక మర్చంట్ తో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ‘ఎన్ కోర్ హెల్త్ కేర్’ సంస్థ సీఈఓ విరెన్ మర్చంట్-శైలజా మర్చంట్ ల కుమార్తెనే రాధిక.
రాజస్థాన్ లోని నాథ్ ద్వారాలోని శ్రీనాథ్ జీ ఆలయంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుక కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. మర్చంట్ కుటుంబానికి, అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలున్నాయి.
ఇదే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల మధ్య ప్రేమకు దారితీసింది. అలాగే అంబానీ ఇంట జరిగే ప్రతి కార్యక్రమంలోనూ రాధిక పాల్గొంటూ అందరి దృష్టినీ ఆకర్షించేది. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు చివరకు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
రాధిక.. న్యూయార్క్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనమిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసింది. రాధికకు శాస్త్రీయ నృత్యం అంటే చిన్న వయసు నుంచే ఇష్టం. ఈ మక్కువతోనే ప్రముఖ డ్యాన్సర్ భావనా థాకర్ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది.