పెద్ద హీరోల సినిమాలు అంటే చాలు అభిమానుల కన్నా మల్టిఫెక్స్‌లు పండగా చేసుకుంటాయి. ఫుల్ కలెక్షన్స్‌తో రెండు చేతులా డబ్బు సంపాదిస్తుంటాయి. కానీ ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు అని సంతోషపడేలోపే సెన్సార్ సర్టిఫికెట్ షాక్ ఇచ్చింది. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు మల్టిఫ్లెక్స్ ఓనర్లకు పెద్ద షాకే ఇచ్చాయి.
ఫుల్ డిమాండ్ ఉన్న సినిమాలు ఉంటే చాలు లెక్కలేనన్ని షోలు, అరగంటకో షోతో పైసా వసూల్ అనిపిస్తాయి. కానీ ఈసారి వారి ఆటలు సాగేలా కనపడటం లేదు. దీనికి కారణం ప్రభుత్వాలో, ఇతర కండిషన్‌లో కాదు. సినిమాల లెంగ్త్… అవును. రెండు కీలక సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల లెంగ్త్ దాదాపు 2 గంటల 40నిమిషాల వరకు ఉన్నాయట. దీంతో… ఎంత టైం సర్దుబాటు చేద్ధామన్నా మల్టిఫ్లెక్స్‌లకు టైం సెట్ అవ్వటం లేదట. సినిమా నిడివి మరో 15 నిమిషాలైనా తక్కువ ఉంటే తమ బిజినెస్ వేరుగా ఉండేదని, పెద్ద సినిమాలైనా బిజినెస్ పెరగటం లేదని వాపోతున్నారట.
అయితే, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొడితే మాత్రం… పెద్దగా ఇబ్బంది ఉండదని, కాస్త ఎక్కువ రోజులు షోలు నడుపుకోవచ్చని వారికి వారే సర్ధిచెప్పుకుంటున్నట్లు టాక్ వినపడుతోంది. చూడాలి మరీ అల్లు అర్జున్, మహేష్‌లు ఏం చేస్తారో…!
రష్మీక కన్నా విజయశాంతికే ఎక్కువా…?
Advertisements
అల్లు అర్జున్‌పై మహేష్ పై చేయి