మావోయిస్టులు రూట్ మార్చారు. ఓ వైపు తమ కేడర్‌ను పెంచుకుంటూ చాప కింద నీరులాగా వస్తున్నారు. మరోవైపు కొత్త తరహాలో దాడులు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా ములుగు జిల్లాలో దొరికిన సాక్ష్యాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ములుగు జిల్లాలో మావోలు కొత్త తరహా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.
బీర్ బాటిల్స్ తో ఐఈడీలు అమర్చి దాడులు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వెంకటాపూర్ పామునూర్ ఫారెస్టులో బీరు బాటిల్స్ ఐఈడీతో మందు పాతరను ఏర్పాటు చేశారు.
కూంబింగ్ చేసే పోలీసులే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే తనిఖీలు చేపట్టిన పోలీసులు ఈ తరహా ఐఈడీ బాంబులను చూసి షాక్ అయ్యారు.
వెంటనే బాంబు డిఫ్యూజల్ టీమ్ నిర్వీర్యం చేసింది. ఇందులో పోలీసుల నివ్వెర పోయే వస్తువులు దొరికాయి. వీటిలో కరెంట్ వైర్లు, బీర్ బాటిల్స్, బోల్టులు, కాపర్ సీల్, గన్ పౌడర్ ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. బాంబులను నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.