ప్రముఖ నటుడు సోనుసూద్ బీఎంసీ నోటీసులను సవాల్ చేస్తూ చేసిన పిటిషన్ ను ముంబై హైకోర్టు కొట్టివేసింది. సోనూసూద్ జుహూ లోని భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే హోటల్ గా మార్చారని బీఎంసీ సోనూసూద్ కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
అయితే ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి నోటీసులు వచ్చిన సమయంలోనే స్పందించాల్సిందని ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని తమ చేతుల్లో ఏమీ లేదని పిటిషన్ ను కొట్టివేసింది.