ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జింబాంబ్వేకు చెందిన మహిళ ఒకరు డ్రగ్స్ తరలిస్తుండగా ఆమెను చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆమె దగ్గర నుంచి రూ. 60 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
అధికారుల వివరాల ప్రకారం… ఆఫ్రికా నుంచి భారత్ కు భారీగా డ్రగ్స్ అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందని కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణీకులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో జింబాబ్వేకు చెందిన మహిళ అనుమానాస్పదంగా అధికారులకు కనిపించింది.
దీంతో ఆమెను అడ్డుకుని తనిఖీలు చేయగా ఆమె దగ్గర డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆమెను జింబాంబ్వేకు చెందిన రోసీగా ఆమెను విచారణలో అధికారులు గుర్తించారు. ఆమె జింబాంబ్వే రాజధాని హరారే నుంచి కిగాలీ గుండా ముంబైకి చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆమె వద్ద మెడికల్ వీసా ఉన్నట్టు తెలిపారు.
‘ మహిళ బ్యాగ్ ను తనిఖీ చేయగా అందులో పసుపు రంగులో ఉన్న 7,006 గ్రాముల పౌడర్ ను గుర్తించాము. దాన్ని పరీక్షలకు పంపగా హెరాయిన్ గా తేలింది. దీంతో పాటు 1480 గ్రాముల తెల్లటి క్రిస్టల్ గ్రాన్యూల్స్ ను స్వాధీనం చేసుకున్నాము. ఇది హెరాయిన్ మెథాంపెటామైన్ గా ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైంది.