ఒలింపిక్స్ బంగారుకొండ నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాడని యావత్ జాతి కొనియాడుతోంది.ఈ క్రమంలో మీడియా అడిగిన ఓ ప్రశ్నకు నీరజ్ చోప్రా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. మీరు సాధించిన బంగారు పతకం బరువు ఎంత ఉండొచ్చు అని ఒకరు అడగ్గా.. 10 కిలోలు ఉన్నా సరే ప్రస్తుతం నాకు తేలికగానే అనిపిస్తుంది. ఈ విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. నేను సాధించిన విజయం ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాను అంటూ చెప్పాడు.
మరోవైపు నీరజ్ చోప్రాకు శిక్షణ ఇచ్చిన జర్మన్ కోచ్ క్లాస్ బర్టోనిజ్ కూడా.. అతనిపై ప్రశంసలు కురిపించాడు. ఫైనల్స్కు వెళ్లేముందు తాను ఒకే విషయాన్ని నీరజ్ చెప్పానని.. ఆటను ఎంజాయ్ చేయమన్నానని తెలిపారు. నీరజ్ చోప్రా చాలా మృదు స్వభావి అని, అందరిలా గొప్పలు చెప్పుకోవడం అతనికి ఇష్టం ఉండేది కాదని తన అనుభవాన్ని వివరించారు కోచ్.