దేశ ఆర్థిక రాజధాని ముంబైకి సంబంధించి రోడె ఐలాండ్ వర్సిటీ చేసిన అధ్యయనం ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ప్రతి యేటా ముంబైలో కొంత భూభాగం సముద్రంలో మునిగిపోతున్నట్టు అధ్యయనం తెలిపింది.
సంవత్సరంలో ముంబైలో 2 మిమీ భూభాగం సముద్రంలో కలిసిపోతోందని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్ లో వర్సిటీ పేర్కొంది. భూ నిమజ్జనం వల్ల ఇలా జరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా 99 దేశాల్లో భూ అధోగమనంపై వర్సిటీ అధ్యయనం చేసింది. అధ్యయనం ప్రకారం…. ప్రపంచంలోనే అత్యంత వేగంగా చైనాలోని టియాంజిన్ ప్రాంతం సముద్రంలో మునిగిపోతోంది. యేటా 5 సెంమీ మేరకు భూమిని సముద్రం తనలో కలుపుకుంటోంది.
ఆ తర్వాత స్థానంలో సెమరాంగ్( ఏడాదికి 3.96 సెంమీ), ఇండోనేషియా రాజధాని జకార్తా (3.44 సెంమీ), చైనాలోని షాంఘై (2.94 సెంమీ), హోచి మిన్హా( 2.81 మిమీ), వియత్నంలోని హనోయ్ (2.44సెంమీ)లు ఉన్నాయి.
భూమి క్షీణత పరిణామాలు శాశ్వతంగా ఉంటాయని వర్సిటీ వెల్లడించింది. ఒక సారి ఇలా కోల్పోయిన భూమిని తిరిగి పొందలమేని వర్సిటీ వివరించింది. ఇలా భూ నిమజ్జనం తర్వాత బాధపడే బదులు మందస్తు చర్యలు తీసుకోవడమే ఉత్తమమని వర్సిటీ చెప్పింది.