చూడబోతే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు.. నిజంగానే బిహార్ వర్సెస్ మహారాష్ట్రగా మారేలా ఉంది. ఇప్పటికే ఈ కేసును రెండు రాష్ట్రాల పోలీసుల పనితీరుకు మధ్య పోటీ అంటూ కొందరు ప్రచారం చేస్తుండగా.. పరిస్థితులను చూస్తోంటే అదే జరిగేలా కనిపిస్తోంది. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును విచారించేందుకు ముంబై వెళ్లిన బిహార్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ తివారీని ముంబై మున్సిపల్ అధికారులు బలవంతంగా క్వారెంటైన్‌కు పంపించారు.
ఇప్పటికే పాట్నా పోలీసులు ముంబైలో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. వారిని గైడ్ చేసేందుకు వినయ్ తివారీ ముంబై రాగా..ఆయన్ను క్వారంటైన్ చేశారు.దీనిపై బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా అతనికి సరైన వసతి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.తాజా పరిణామాల నేపథ్యంలో ఈకేసు ఆసక్తికరంగా మారింది.