అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవిల బెయిల్ ను రద్దు చేయాలని కోర్టును ముంబై పోలీసులు కోరారు. ఈ మేరకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానంలో పోలీసులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
కౌర్ దంపతులకు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ను గతవారం మంజూరు చేసింది. అయితే కోర్టు ఆదేశాలను కౌర్ దంపతులు ఉల్లంఘించారని పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు.
బెయిల్ వచ్చాక కేసు విషయాలను బయట చర్చించ వద్దని కోర్టు సూచించింది. కానీ ఆ ఆదేశాలను ఎమ్మెల్యే రవి ఉల్లంఘించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదివారం పేర్కొన్నారు.
ఈ క్రమంలో పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. కాగా సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని ఎంపీ నవనీత్ కౌర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.