సుశాంత్ మరణానికి సంబంధించి మరో కొత్త కథనం వెలువడింది..సుశాంత్ తండ్రి కెకెసింగ్ కంప్లైంట్ తో ఒకవైపు బీహార్ పోలిసులు కేసుని చేదించడానికి ప్రయత్నిస్తున్నారు..మరోవైపు ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.. ఈ మేరకు మరణించడానికి ముందు ఇంటర్నెట్ లో నొప్పి లేకుండా చావడం (painless death) ఎలా అని సుశాంత్ సెర్చ్ చేసినట్టుగా ముంబై పోలిసులు ప్రకటించారు..
సుశాంత్ మరణానికి నాలుగు రోజుల ముందు అతని మాజి మేనేజర్ దిశా సాలియన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. దిశా మరణంలో తన పేరు ప్రస్తావించడాన్ని తట్టుకోలేక పోయారని ..దాంతో ఆందోళనకు గురయి ఆత్మహత్య చేసుకున్నారని ముంబై పోలీసులు మీడియాకు చెప్పారు..మరణానికి ముందు స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్ , నొప్పి తెలియకుండా ఎలా చనిపోవాలో గూగుల్ లో సెర్చ్ చేశాడని…ఈ విషయాలన్ని ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లో తేలాయని తెలిపారు.
సుశాంత్ చనిపోవడానికి ముందు తన పేరుని సెర్చ్ చేసాడని తొలుత తెలిపిన పోలీసులు ఇప్పుడు ఈ విధంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.. సుశాంత్ మరణానికి కారణం రియానే అంటూ అతని తండ్రి కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముంబై పోలిసులు మాత్రం సుశాంత్ ది ఆత్మహత్యే అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారని.. ఎవరిని రక్షించడానికి ఇదంతా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.