బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి మరో సవాల్ ఎదురైంది. కంగనా రనౌత్ నిషేధిక డ్రగ్స్ వాడతారని వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ముంబై పోలీసులను ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిషేధించిన పదార్థాలు, నార్కోటిక్స్ డ్రగ్స్‌ను ఆమె వాడతారనే ఆరోపణల నిగ్గు తేల్చాలని ముంబై పోలీసులను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది.
కంగనా రనౌత్ కొకైన్ వాడతారని, తనను కూడా డ్రగ్‌ను తీసుకోమని కోరినట్లు నటుడు సుమన్ ఇంటర్వ్యూ భయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తగా… ఇక ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. అయితే ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలా…? నార్కొటిక్స్ సంస్థకు దర్యాప్తును బదిలీ చేయాలా అన్న అంశాన్ని మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించాల్సి ఉంది.
మరోవైపు తను డ్రగ్స్ వాడినట్లు వచ్చిన అంశంపై స్పందించిన కంగనా… తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని ప్రకటించారు.