దేశంలో వివాహ బంధాలు వీగిపోయి వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా కావొచ్చు అటువంటి వాటి మోజులోపడి భార్యలు, భర్తలను చంపుతున్నారు.నేటి సమాజంలో ఇటువంటి ఉదంతాలు తరచూ జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే పరిస్థితి. సినిమాల ప్రభావమో సీరియల్ ప్రభావమో అనుకుంటే పొరపాటే నిజజీవితంలో జరిగే సంఘటనలే సినిమాలకు, సీరియళ్ళు ఆధారాలవుతున్నాయనేది కొట్టిపడేయలేని అంశం.
ఇటీవల అలాంటి ఓ సంఘటన మహిళాలోకానికి సిగ్గుపడేలా చేసింది. వివాహ వ్యవస్థకు తూట్లు పొడిచింది.భర్తకు స్లోపాయిజన్ ఇచ్చి నెమ్మదిగా ఆరోగ్యం క్షీణించేలా చేసింది. చివరికి భర్తప్రాణాలు హరించింది.ముంబైలోని శాంతాక్రూజ్ లో నివాసముంటున్న కవిత,కమల్ కాంతు లకు 2002లో పెళ్ళైంది. ప్రస్తుం వాళ్ళకి 20 ఏళ్ళకూతురు,17 యేళ్ళకొడుకు ఉన్నారు. అయితే కమల్ కాంత్ స్నేహితుడు హితేశ్ తో గతకొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు విషయం తెలయడంతో తరచూ భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఆమె భర్తతో విడిపోయి వేరుగా ఉంటుంది.
కొన్నేళ్ళ తర్వాత మళ్ళీభర్త దగ్గరుకు వచ్చి పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు వాళ్ళకోసమైన మనం కలిసిఉండక తప్పదు అన్నీమర్చిపోయి కలిసి ఉందాం అని నమ్మబలికింది. కలమ్ కూడా ఒప్పుకున్నాడు.
ఈ యేడాది జూన్లో కమల్ కాంత్ తల్లి తీవ్రకడుపునొప్పితో చనిపోయింది. అత్తగారి మరణం కమల, అక్రమ సంబంధం పెట్టుకున్న హితేష్ లకు కొత్తఆలోచన మొలకెత్తింది. భర్త అడ్డుకూడా తొలగించుకుంటే చట్టరీత్యా ఆస్థిహక్కు తనకే వస్తుందకున్నారు. కమల్ చంపెద్దామని నిర్ణయించుకున్నారు.
ప్లాన్ లో భాగంగా కమల భర్తకు స్లోపాయిజన్ ఇస్తూవచ్చింది. కమల్ ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. గత ఆగస్ట 27న తీవ్రకడుపునొప్పిరావడంతో ఆసుపత్రిలో చేర్పించారు నయం కాలేదు.మెరుగైన వైద్యం కోం సెప్టెంబర్లో ముంబై కి తరలించారు. కావాలని విషం కలిపే భార్య ఉండగా భర్తఆరోగ్యం ఎలా చక్కబడుతుంది!? నవంబర్ 19న కవిత కల నెరవేరింది. కొన్ని నెలల పోరాటం అనంతరం కమల్ కాంత్ ప్రాణాలు విడిచాడు.
పోలీసులు సహజమరణంగానే గుర్తించి కేసు క్లోజ్ చేసారు. అయితే ప్రాణంతకమైన ఆర్సెనిక్,థాలియం లను కమల్ డెడ్ బాడీలో గుర్తించారు. నివేదిక పోలీస్ చేతికి చేరింది. దీంతో కవిత కసాయితనం బైటపడింది. పోలీసుల తరహాలో ప్రశ్నించి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ఆమెకు,సహకరించిన ప్రియుడు హితేష్ ని అదుపులోనికి తీసుకున్నారు. 20 యేళ్ళకూతురు,17 కొడుకు ఉండగా భర్తను చంపి ప్రియుడితో ఉండాలనుకోవడాన్నిఎలా అర్ధం చేసుకోవాలి. స్వార్థమా…? స్నేహమా..?మోహమా…? ఏమనుకోవాలి.!