ముంబైలో మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. జుహూ ప్రాంతంలోని ఓ హోటల్ లో రైడ్స్ నిర్వహించిన పోలీసులు ఓ టీవీ నటిని అరెస్ట్ చేశారు. ఈమె హైటెక్ వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.
ఈమధ్య ఇద్దరు అమ్మాయిల ఫోటోలను కొంతమంది డబ్బున్న వ్యక్తులకు పంపిన నటి.. గంటకు లక్ష అంటూ డీల్ కుదుర్చున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ విషయం తెలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు చెప్పారు.
అరెస్టయిన నటి కొందరు నటీమణులు, మోడల్స్ ను బలవంతంగా ఈ రొంపిలోకి దింపుతున్నట్లు నిర్ధారించారు పోలీసులు. విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.