ఇటీవల మున్సిపల్ శాఖ అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని.. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఆక్రమణలపై మున్సిపల్ శాఖ దృష్టి పెట్టింది. మల్లంపేట్ లోని అక్రమ నిర్మాణాల పై కొరడా ఝళిపించింది. అనుమతులు లేకుండానే 260 విల్లాలు నిర్మించిన శ్రీనివాస కన్సస్ట్రక్షన్ యజమాని ఎన్.ఆర్.ఐ. విజయ లక్ష్మి చౌదరీ పై కేసు నమోదైంది.
ఫోర్జరీ, ట్రెస్ పాస్, చీటింగ్, వాల్టా యాక్ట్ సెక్షన్స్ లో కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. చెరువును, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఆమె పై ఆరోపణలు ఉన్నాయి. గ్రామ పంచాయితీ పర్మిషన్స్ లేకుండానే ఫేక్ డ్యాకెమెంట్స్ తయారి చేసినట్లు తెలుస్తుంది. వరంగల్ మంత్రి, తన సామజిక వర్గ ఎమ్మెల్యేల సఫర్ట్ తోనే ఈ దందా చేసినట్లు అనుమానం అనుమానం వ్యక్తమవుతోంది.