మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా గురువారం క్యాబినెట్ సమావేశం జరిగినట్లు ఉందంటున్నారు రాజకీయ విశ్లేకులు. వర్షాలతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. వాటిని తక్షణమే పునరుద్ధరించాలని దీనికోసం 571 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసిందని మీడియా సమావేశం లో ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రకటించడం ఇందుకు నిదర్శమన్నారు విశ్లేషకులు. అలాగే సాగునీటి ప్రాజక్టుల పురోగతి, దానివలన కలిగే ఉపయోగాల గురించి ధాన్యం కొనుగోలు ఇతర విషయాలు కూడా క్యాబినెట్ లో చర్చించి నట్లు సీఎం కేసీఅర్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఎందుకంటే హైకోర్టు శుక్రవారం మున్సిపల్ ఎన్నికల పై గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది… ఈనేపథ్యంలో దానికి సిద్దంకావాలని భావించి కేసీఅర్ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు అంటున్నారు.
రైతు సమన్వయ సమితిని పట్టిష్టం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పుకొచ్చారు సీఎం. అలాగే ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి అందులో యూనియన్ ల పాత్ర, విపక్షాల పాత్ర ల గురించి మాట్లాడుతూ సమ్మెకు కారణం సంఘాలు వారిని నడిపించిన ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోస్తూ మీ బతుకులు ఆగాం కావడానికి వాళ్ళే కారణం అంటూ సీఎం చెప్పుకొచ్చారు. పనిలోపనిగా ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్లు కూడా ప్రకటించారు. ఇప్పటిదాకా మొండి పట్టుదలకుపోయి ఇన్ని రోజులు సమ్మె జరగడానికి కారణం అయ్యి ఇప్పుడు నేరం ప్రతిపక్షాల మీద నెట్టడం రాజకీయ ఎత్తుగడగానే కనపడుతోంది.
ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ ఒడ్డునపడాలంటే మరో మార్గం లేదు. సమ్మెను తక్షణమే విరమింపచేయడం అందుకో రాజకీయ వ్యూహంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలలో గెలుపే ముఖ్యంగా ముఖ్యమంత్రి భావించారు అంటున్నారు విశ్లేషకులు.. ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఎన్నికలు ఉంటే కాని ప్రజల సమస్యలను పట్టించుకునేట్లు లేవు ఎవరు ఏమనుకున్నా పర్వలేదు అనుకున్న సీఎం కేసీఅర్ సడన్‌గా ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో, దీనిలో ఉన్న మతలబు ఏమిటో రాజకీయ అవగాహను ఉన్నవారికి అర్థం అవుతుంది అంటున్నారు.
యాబై రోజులకు పైగా ఇంతమంది ప్రాణాలు ఎందుకుపోవాలి, ఇటు కార్మికులు అటు రోడ్డు ప్రమాదాలలో ప్రజల ప్రాణాలు ఎందుకు కోల్పోవాలి, ఇన్ని రోజులు సమ్మె ఎందుకు సాగాలి ఈ ప్రకటన ఎదో అప్పుడే ఇచ్చివుంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదుగా… తాత్కాలిక డ్రైవర్ కండక్టర్ లతో బస్సులను నడిపించి సంస్థకు మరింత నష్టం వచ్చేవిధంగా ఎందుకు వ్యవహరించినట్లు అటు తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు ఇటు ఆర్టీసీ అధికారులు దోచుకునే అవాకశం ఎందుకు ఇచ్చినట్లు…? దీనికి కారకులు ఎవరు…? ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు సమ్మె సాగదీసే అవకాశం ఇచ్చినట్లు…? ఇప్పుడు ఇస్తామన్న వంద కోట్లు అప్పుడే ఇవ్వచ్చుగా అన్న ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి.
ఇప్పుడు పెంచుతామన్న ఆర్టీసీ చార్జీలు అప్పుడే పెంచి, ఛార్జీలు పెంచుకుంటేనే సంస్థ బతుకుతుంది అని చెప్పొచ్చు గా… అప్పుడేమో ఆర్టీసీలో పోటీ తతవ్వం పెంచాలి అలా పెంచాలంటే కొన్ని రూట్స్ ను ప్రేవెట్ సంస్థలకు వ్యక్తులకు ఇవ్వాలని ఇప్పుడు దేశం అంతా అదే జరుగుతుంది అనికూడా సమ్మె సందర్భంగా కేసీఅర్ మీడియా సమావేశంలో చెప్పిన విషయాని గుర్తు చేస్తున్నారు. ఆర్టీసీని నడపలేమని జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని ఆస్తులు అమ్మితే తప్ప జీతాలు ఇవ్వలేమని కార్మికులు పనిచేసిన సెప్టెంబర్ నెలకు కూడా జీతాలు ఇవ్వలమేని ఆర్టీసీని ఆదుకోవడం ప్రభుత్వానికి కష్టం అని హైకోర్టు లో ప్రభుత్వం ఆఫిడివెట్ వేసింది నిజం కాదా…? అడ్వకేట్ జనరల్ వాదించింది నిజం కాదా…? ఆర్టీసీ కోలుకోలేని పరిస్థితులలో ఉంది అప్పులలో ఉంది నష్టాలలో ఉంది అంటూ ప్రతిసారీ చెపుతూ వచ్చి ఇప్పుడు మేము ఆదుకుంటాం రూట్లను ప్రేవేటు వ్యక్తులకు ఇవ్వవం ఇవ్వని ఆలోచన మాకులేదు అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు పైగా నేరం ప్రతిపక్షాల మీదకు నెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.