అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ కొరడా ఝుళిపించింది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.
గ్రామ పంచాయితీ అనుమతితో G+2 తో రెసిడెన్షియల్ బిల్డింగ్లకు మాత్రమే అనుమతి ఉందని.. లే అవుట్, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతి ఇవ్వరాదని తెలిపింది. గ్రామ పంచాయతీ అనుమతితో వేసిన లే అవుట్, గేటెడ్ కమ్యూనిటీలను గుర్తించి కూల్చి వేయాలని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మున్సిపల్ కమిషనర్లనే ఆదేశించింది.