రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. మున్సిపాలిటీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా… సింగిల్ బెంచ్‌లో చాలా మున్సిపాలిటీ ఎన్నికలపై స్టే ఉంది. వాటిపై ఈరోజు విచారణకు రానుంది. డివిజన్ బెంచ్ స్టే ఎత్తివేసిన నేపథ్యంలో… సింగిల్ బెంచ్‌లో స్టే ఎత్తివేయటం లాంఛనమే అని భావిస్తోంది ప్రభుత్వం.
ఇప్పటికే… ఎన్నికల కమీషన్ కూడా ఎన్నికల నిర్వహణకు రెడీ అని స్పష్టం చేసిన నేపథ్యంలో… మున్నిపల్ శాఖ నుండి కూడా ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఒకవేళ సింగిల్ బెంచ్‌లో స్టే ఎత్తివేయకున్నా… ఎన్నికల నిర్వహణకు ఆటంకం లేని మున్సిపాలిటీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు సమాచారం.