కృష్ణాజిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు గత కొన్ని నెలలుగా జీతాలు లేక పస్తులతో అలమటిస్తున్నామని, అధికారులకు చెప్పినా పెడచెవిన పెట్టటంతో చేసేదేమీలేక సమ్మె బాట పట్టమని మున్సిపల్ కార్మికులు తెలిపారు.
మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి అన్ని బిల్లులు అవుతున్నాయి కానీ ఆఖరికి ఉద్యోగస్తులు జీతాలు కూడా ప్రతినెల అందుతున్నాయి కానీ పట్టణాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తీసుకువచ్చే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేకపోవటం విడ్డురమని ఆరోపించారు.
కనీసం పెంచిన జీతాలను ఇవ్వకపోయినా ఉన్న జీవితాన్ని కూడా ఇవ్వడం లేదని, కార్మికులకు పనిచేస్తున్న సమయంలో ఇవ్వవలసిన కనీస మౌలిక సదుపాయాలు ఇవ్వడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలను ఇచ్చి వాళ్ళకి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని లేకపోతే రోజు రోజుకి సమ్మెను తీవ్రత పెంచి తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు.