తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒత్తిడి కారణంగానే రోహిత్ రెడ్డిని కిడ్నాప్ చేశారని.. మున్నూరు రవి తీవ్ర ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లాలోని రోహిత్ రెడ్డి అనే యువకుడి కిడ్నాప్ కలకలంగా మారింది. మార్చి 14వ తేదీ అర్థరాత్రి 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు రోహిత్ రెడ్డిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మున్నూరు రవికి సపోర్ట్ చేస్తున్నాడనే కారణంతోనే పోలీసులు రోహిత్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. రోహిత్ రెడ్డి హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
రోహిత్ రెడ్డిని మంత్రి శ్రీనివాస్ గౌడే కిడ్నాప్ చేయించాడని మున్నూరు రవి చెబుతున్నాడు. జిల్లాలో శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా పని చేసే వారిపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించాడు.
రోహిత్ రెడ్డిని తీసుకురావాలని మహబూబ్ నగర్ కు చెందిన పోలీసులు కాల్ చేసినట్లు చెప్పాడు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒత్తిడి వల్ల పోలీసులే రోహిత్ రెడ్డిని కిడ్నాప్ చేశారని ఆరోపణలు గుప్పించాడు మున్నూరు రవి. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా హీటును రాజేస్తుంది.