చౌటుప్పల్, తొలివెలుగు:మునుగోడులో గెలుపు టీఆర్ఎస్ కు ఎంతో ప్రతిష్టాత్మకం. ఒక్క సీటు వల్ల ఏం నష్టం లేదని గులాబీ నేతలు పైకి ప్రగల్భాలు పలుకుతున్నా.. తర్వాతి ఎన్నికలను ఈ ఉప ఎన్నిక ప్రభావం చూపే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ పండితులు.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పెద్దలంతా మునుగోడులో దిగి ప్రచారం నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఈ సందర్భంగా పలువురు నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా మునుగోడు నియోజక వర్గంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
చౌటుప్పల్ ఆరె గూడెంలో ఆయనకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన్ని గౌడ కులస్తులు అడ్డుకున్నారు. కాటమయ్య ఆలయం కోసం రూ.12 లక్షలు ఇస్తామని మంత్రి రెండు రోజులు క్రితం ఒప్పుకున్నారని అన్నారు. ఇప్పుడు కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చారని గౌడ కులస్తులు తీవ్రంగా మండిపడ్డారు. మిగిలిన రూ.10 లక్షలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల తర్వాత నాయకులు ఎవరూ ఇటువైపు రారంటూ గౌడ సంఘం నాయకులు నిలదీశారు. మరోవైపు యాదవ, వడ్డెర సంఘాలకు ఆలయాల నిర్మాణాల కోసం డబ్బులు ఇస్తామని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
పూర్తి కథనం…