పాతబస్తీ నుండి హిందువుల వలసలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు. 1970 తర్వాత వారి సంఖ్య అక్కడ ఎందుకు తగ్గిందో అందరికీ తెలియాలన్నారు. కాశ్మీర్ ఫైల్స్ తరహాలో త్వరలో హైదరాబాద్ ఫైల్స్ కూడా వస్తుందని స్పష్టం చేశారు. అసలు.. తెలంగాణ భారతదేశంలో ఉందా? పాకిస్తాన్ లో ఉందా? అని ప్రశ్నించారు.
ఎంఐఎం పార్టీ హైదరాబాద్ నుండి ఇస్లామాబాద్ వరకు టెర్రర్ కారిడార్ ఏర్పాటు చేస్తోందని విమర్శించారు. నిజామాబాద్, భైంసా, నిర్మల్, బోధన్ ప్రాంతాలను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చిందని ఆరోపించారు. ఆ ఉగ్రవాదానికి టీఆర్ఎస్, పోలీసులు సహకరిస్తున్నారని అన్నారు.
బోధన్ లో హిందువులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు మురళీధర్ రావు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసిపోయి ఈ కుట్రలు చేస్తున్నాయన్నారు. మొన్న నిర్మల్… నిన్న భైంసా… నేడు బోధన్ వరకు అంతా ఉగ్రవాదుల కారిడార్ గా మారుస్తున్నారని విమర్శించారు.
మతోన్మాద, ఉగ్రవాద కార్యకలాపాలకు కారణం కేసీఆరేనని.. హిందువుల ప్రాణాలు, ఆస్తుల నష్టానికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్ లవ్ జిహాద్ కేసుల్లో పురోగతి ఏదని ప్రశ్నించారు మురళీధర్ రావు.