తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేశారన్న కక్షతో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నానికి ప్రయత్నించాడో వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం ఉంటున్నారు.
ఆయన నివాసానికి సమీపంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా సంచరిస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు.
ఆ వ్యక్తి కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా అధికారులు గుర్తించారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి ఎమ్మెల్యే సస్పెండ్ చేయడంతో ఆయన పై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యే పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు.
Advertisements
నిందితుని వద్ద నుంచి పోలీసులు ఓ కత్తి, పిస్తోలును స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. నిందితున్ని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.