సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మిర్యాలగూడ అమృత ప్రణయ్ జీవిత కథ ఆధారంగా మర్డర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. ఈ వివాదాలను అన్నింటిని తొలగించుకొని మర్డర్ సినిమా నేడు రిలీజ్ కు సిద్ధమైంది.కానీ నల్గొండ లో మాత్రం రిలీజ్ కు బ్రేక్ పడింది. ఇక చివరి క్షణాల్లో కూడా రిలీజ్ ను ఆపాలని అమృత పిటిషన్ దాఖలు చేశారు. అమృత పిటిషన్ పై కోర్టు విచారణకు నిరాకరించింది.
అయితే మొత్తం తెలుగులో రెండు వందల థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది. రేపు కన్నడ భాషలో 100 థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు రిలీజ్ నేపథ్యంలో పోస్టర్లు కూడా వేసుకోలేక పోయాం అంటూ నిర్మాత నట్టికుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ నల్గొండలో థియేటర్ల యజమానులు ముందుకు రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. నల్గొండ జిల్లాలో మర్డర్ సినిమా రిలీజ్ కాకుండా బెదిరించి ఆపేశానంటూ చిత్ర యూనిట్ ఆరోపణలు చేస్తోంది.