పట్టాకోసం ఎంతో కాలంగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా… ఎమ్మార్వో విజయారెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు హత్య చేసిన సురేష్ ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ నుండి పోలీసులు వాంగ్మూలం రికార్డ్ చేశారు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తన కుటుంబం రోడ్డున పడిందని, అందుకే ముందే పెట్రోల్ కొనుక్కొని… బ్యాగులో పెట్టుకొని విజయారెడ్డి వద్దకు వెళ్లానని చెప్పాడు.
చివరి ప్రయత్నంగా మరోసారి రిక్వెస్ట్ చేసినా… పట్టా ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది, అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించా… నేను కూడా చనిపోవాలనుకున్నా అని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.