ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో ఆర్టీసీ కార్మికుడు తనువు చాలించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామానికి చెందిన సిద్దగోని రమేష్ గుండెపోటుతో మృతిచెందాడు. డ్రైవర్ సిద్దగోని రమేష్ ముషీరాబాద్-1 డిపోలో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒక వైపు జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు కేసీఆర్ నిర్ణయాలతో టెన్షన్ పడటంతో గుండెపోటు వచ్చింది. ఇప్పటికే సమ్మె 19 వ రోజుకు చేరుకుంది. 18 రోజుల సమ్మె లో రమేష్ ఎంతో చురుకుగా పాల్గొన్నాడని తోటి కార్మికులు చెప్తున్నారు. కేసీఆర్ ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తావంటూ కార్మికులు ప్రశ్నించారు.