బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిర్వహిస్తున్న బంగబంధు టీ20 కప్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో తన తోటి ప్లేయర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికుర్ రహీంకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. టోర్నీలో భాగంగా ఫార్చూన్ బరిషల్ అనే టీంతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రహీం తన తోటి ప్లేయర్ నసుమ్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రహీం అతన్ని కొట్టినంత పనిచేశాడు.
కాగా రహీం బెక్సింకో ఢాకా టీంకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఆ మ్యాచ్ సందర్భంగా బరిషల్ టీం ప్లేయర్ కొట్టిన బంతి గాల్లోకి లేచింది. దీంతో రహీం, నసుమ్ ఇద్దరూ క్యాచ్ పట్టేందుకు పరిగెత్తారు. కానీ రహీంను చూసిన నసుమ్ చివరి క్షణంలో తప్పుకున్నాడు. ఈ క్రమంలో రహీం క్యాచ్ పట్టాడు. కానీ కొంచెం ఉంటే క్యాచ్ మిస్సయ్యేది అని చెప్పి నసుమ్‌పై రహీం విరుచుకు పడ్డాడు. మైదానంలో అందరూ చూస్తుండగానే మ్యాచ్ మధ్యలో ఉన్నామన్న ధ్యాస కూడా లేకుండా నసుమ్‌పై రహీం దురుసుగా, అవమానకరంగా ప్రవర్తించాడు. ఓ దశలో అతను నసుమ్‌ను కొడతాడని కూడా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
అయితే మ్యాచ్‌లో రహీం ప్రవర్తించిన తీరును బీసీబీ తప్పు పట్టింది. అతను బీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్లు నిర్దారించింది. ఇక రహీం కూడా చేసిన తప్పును అంగీకరించి ఫేస్‌బుక్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఈ క్రమంలో అతను తప్పు ఒప్పుకున్నందుకు గాను బీసీబీ అతనికి మ్యాచ్ ఫీజులో కేవలం 25 శాతం ఫైన్‌తో సరిపెట్టింది. ఇక అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కలిపింది. 4 డీమెరిట్ పాయింట్లు అయితే ప్లేయర్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. అయితే ఇకపై అలాంటి తప్పు చేయబోనని రహీం తెలిపాడు.
Watch Video
Grow up man #mushfiqurrahim 😂 pic.twitter.com/UhvfbP2AVw
— Ram (@RamTDP999) December 14, 2020
Not only once, Mushfiqur did it twice 🤣🤣🤣 pic.twitter.com/zpSriYRYhY
— cricket videos (@middlestump5) December 16, 2020
Advertisements