దేవిశ్రీ ప్రసాద్ అనగానే ఉర్రూతలూగించే మ్యూజిక్ గుర్తొస్తుంది. కానీ కొంతకాలంగా దేవి మ్యూజిక్ మ్యాజిక్ చేయలేకపోతుంది. ఓ దశలో ఇక దేవిశ్రీ ప్రసాద్ కు ఛాన్స్ లేక ఖాళీ అయిపోతున్న సందర్భంలో సుకుమార్ పుష్ప సినిమా ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మరో ఛాన్స్ కొట్టేశాడు.
గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ తో సినిమా చేయబోతున్నాడు. వకలీ సాబ్ తో పాటు డైరెక్టర్ క్రిష్ తో సినిమా పూర్తవ్వగానే హరీష్ శంకర్ మూవీ మొదలుకాబోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉండటంతో సినిమాలో ఇతర ఆర్టిస్టులు, క్రూపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
సినిమాలకు మ్యూజిక్ ఎంత కీలకమో దేవిశ్రీ ప్రసాద్ ఎన్నో సార్లు ప్రూవ్ చేశాడు. గబ్బర్ సింగ్ సినిమా హిట్ లోనూ మ్యూజిక్ తనవంతు పాత్ర పోషించింది. దీంతో దేవి ఫాంలో లేకపోయినా సరే… హరీష్ శంకర్ ఎంతో నమ్మకంతో ఆయనకే ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండే అంచనాలు, మ్యూజిక్ క్లిక్ అయితే మళ్లీ గాడిలో పడొచ్చన్న ఆలోచనతో దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.