రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధే శ్యామ్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా ఓ టి టి లో రిలీజ్ కాబోతోంది అంటూ కొన్ని వార్తలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు.
రాధేశ్యామ్ థియేటర్స్ లోనే వస్తుంది. మా టీమ్ నుంచి ఎంతో ప్రేమతో.. గ్రాండ్ విజువల్స్, గ్రాండ్ సౌండ్స్, గ్రాండ్ మేకింగ్ వస్తాయి. మీ అందరితోనూ నేను థియేటర్స్ లోనే ఈ అద్భుతమైన సినిమాను చూస్తాను అంటూ తమన్ ట్వీట్ చేశాడు.
ఇక రాధేశ్యామ్ చిత్రానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ దీంతోపాటు ఆదిపురుష్ , సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు.