దేవి శ్రీ ప్రసాద్, థమన్ ఈ ఇద్దరూ కూడా రెండు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో విజయవంతమైన సంగీత దర్శకులు. పెద్ద హీరోలు నటిస్తున్న భారీ బడ్జెట్ తెలుగు సినిమాలకు దేవిశ్రీ లేదా థమన్ సంగీత దర్శకులుగా ఉంటారు.
అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గత మూడు, నాలుగేళ్లలో డీఎస్పీ కంటే థమన్ చాలా బాగా రాణిస్తున్నట్లు కనిపిస్తోంది. పుష్ప, రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖి, ఖిలాడీ వంటి ఆల్బమ్స్ దేవిశ్రీ ప్రసాద్ నుంచి వచ్చాయి. ఇందులో పుష్ప తప్ప మిగిలిన సినిమాల్లోని పాటలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.
మరోవైపు థమన్ అఖండ, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు సినిమాలకు అనూహ్యంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నింటికంటే మించి, ఈ రెండు చిత్రాలకు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక సర్కారు వారి పాట “కళావతి” సాంగ్ ను కూడా థమన్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ కూడా మంచి హిట్ అయింది.
మొత్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే దేవిశ్రీ ని థమన్ చాలా డామినేట్ చేస్తున్నాడు. సోషల్ మీడియా లో కూడా సంగీత ప్రియులు “థమన్ శకం” అని పిలుస్తున్నారు. మరి దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడో చూడాలి.