నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాడు మ్యూజిక్ డైరక్టర్ థమన్. అల వైకుంఠపురంలో సినిమా కోసం ఆయన సమకూర్చిన సంగీతం విమర్శకుల నోళ్లను మూయించింది. ఎప్పుడు ఒకే రకమైన సాంగ్స్ చేస్తుంటాడు అనే వాళ్ళకి అల సినిమా సంగీతంతో గట్టి సమాధానం చెప్పాడు థమన్. ఇక ఈ సినిమా విజయోత్సవ వేడుకలో చిత్ర బృందమంతా కలిసి మూవీ సక్సెస్ కు థమన్ అందించిన మ్యూజిక్ కారణమని చెప్పుకొచ్చారు. దాంతో థమన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక ఈ సంవత్సరం మనోడి ఖాతాలో పెద్ద పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. వాటిలో పవన్ పింక్ రీమేక్ అయితే మరొకటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలోని మహేష్ బాబు సినిమా.
మహేష్ బాబు చేసే సినిమాల్లో దాదాపుగా దేవీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా తీసుకుంటారు. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో దేవీ ప్రసాద్ ఆశించన మేర ఆకట్టుకోలేకపోవడంతో అతని ప్లేసులో థమన్ ని తీసుకోవాలని వంశీకి మహేష్ బాబు సూచించారు. తనకు అదిరిపోయే సంగీతాన్ని అందించాలని మహేష్ బాబు థమన్ ను కోరినట్టు సమాచారం. అలాగే పవన్ పింక్ రీమేక్ కు కూడా మంచి సంగీతాన్ని అందిస్తానని పవన్ కు థమన్ హామీ ఇచ్చాడట. పవన్ సినిమాలోని కొన్ని పిక్స్ చూసిన థమన్ అందుకు తగ్గ సంగీతాన్ని అందించేందుకు బెస్ట్ ట్యూన్స్ రెడీ చేస్తున్నాడట. తన శక్తి మేర అత్యుత్తమ ట్యూన్స్ ను పింక్ రీమేక్ కోసం రెడీ చేస్తానంటూ ట్విట్టర్ వేదికగా థమన్ హామీ ఇచ్చాడు.