పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతోందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఆ ప్రకటన వెలువడినప్పటి నుంచి కూడా అభిమానులంతా ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఫిబ్రవరి 14న పవన్ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ వస్తుందని థమన్ చెప్పడంతో అంతా సెకండ్ సాంగ్ వస్తుందని అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 14న వచ్చేది సాంగ్ కాదని తేల్చి చెప్పేశాడు. ఇంకా పాటల పనిలోనే ఉన్నామని త్వరలోనే వాటిని విడుదల చేస్తామని తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశ చెందారు.