ఖుషి సినిమాకు సంబంధించి కొన్ని రోజులుగా గందరగోళం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. సమంత ఓ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది. అది చాలదన్నట్టు విజయ్ దేవరకొండ కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. అటు దర్శకుడు శివ నిర్వాణ కూడా కొత్త ప్రాజెక్టుపైకి వెళ్తాడనే ఊహాగానాలు చెలరేగాయి.
అలా కొన్ని రోజులుగా నలుగుతున్న ఖుషిపై ముందుగా శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చాడు. అతి త్వరలో సినిమా సెట్స్ పైకి వస్తుందని ప్రకటించాడు. అయినప్పటికీ ఆ ప్రకటనలో స్పష్టత లేకపోవడంతో ఊహాగానాలు ఆగలేదు.
ఆ తర్వాత సమంత కూడా స్పందించింది. త్వరలోనే ఖుషి సినిమా స్టార్ట్ అవుతుందని ప్రకటించింది, ఈ సందర్భంగా దేవరకొండ ఫ్యాన్స్ కు సారీ కూడా చెప్పింది. అయినప్పటికీ ఖుషిపై అనుమానాలు తగ్గలేదు.
ఈ నేపథ్యంలో మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఖుషి సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయంటూ పోస్ట్ పెట్టారు. ఈ పిక్ లో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణతో పాటు మ్యూజిక్ డైరక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ ఉన్నారు. దీంతో ఖుషి సినిమా పనుల్లో కాస్త చలనం వచ్చినట్టయింది. ఇకపైనా ఊహాగానాలు ఆగుతాయేమో చూడాలి.