సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్. ఈ సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ మొదలుపెట్టినట్టు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
త్రివిక్రమ్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ… సంక్రాంతి సందర్భంగా త్రివిక్రమ్, మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాం. మా మ్యూజికల్ జర్నీ ఇలా కొనసాగుతూనే ఉండాలి అంటూ పేర్కొన్నారు.
ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్న ట్లు తెలుస్తోంది.