మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది బీహార్ లోని ఓ ముస్లిం కుటుంబం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణానికి రూ.2.25 కోట్ల విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చి తన మంచి మనసును చాటుకుంది.
ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ చీఫ్ కిషోర్ కునాల్ వెల్లడించారు. ‘విరాట్ రామాయణ్ మందిర్’ ఆలయాన్ని ఇటీవల మహవీర్ మందిర్ ట్రస్ట్ చేపట్టింది. ఈ ఆలయ నిర్మాణానికి గౌహతికి చెందిన వ్యాపార వేత్త అహ్మద్ ఖాన్ భూమిని విరాళంగా ఇచ్చారు.
దీనికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ ఇటీవలే పూర్తయ్యాయి. అహ్మద్ ఖాన్ కుటుంబం ఇచ్చిన ఈ విరాళంతో హిందూ ముస్లిం వర్గాల మధ్య మరింత సామాజిక సామరస్యం ఏర్పడిందని కిషోర్ కునాల్ పేర్కొన్నారు.
ఆ ముస్లిం కుటుంబం సహాయంతో ఇప్పుడు ఆలయ నిర్మాణ కల సాకారమవుతోందన్నారు.