కులమతాలకతీతంగానో.. కట్నం తీసుకోకుండానో.. లేక అవతలివారిలో లోపాలున్నా సరే హుందాగా స్వీకరించి పెళ్లి చేసుకుంటే సాధారణంగా దాన్ని ఆదర్శ వివాహంగా చెప్తుంటారు. అయితే ఆదర్శ వివాహంలోనే కూడా మరో అడ్వాన్స్ స్టెప్ ముందుకేసింది ఖమ్మం జిల్లా అన్నాడుగూడెంకు చెందిన అనిల్‌కుమార్, షేక్ సోనీ జంట.
అబ్బాయి క్రిస్టియన్.. అమ్మాయి ముస్లిం.. ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. విషయం పెద్దవారికి చెప్పారు.. అయితే పెళ్లికి అమ్మాయి తరపువారు ఒప్పుకోలేదు. దీంతో అబ్బాయి పేరెంట్సే ముందుకొచ్చి వారి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడో ఓ చిక్కొచ్చింది.
సాధారణంగా క్రిస్టయన్స్ తమ పెళ్లిని చర్చిలో వారి సంప్రదాయం ప్రకారం చేసుకుంటారు. ముస్లింలు అయితే నిఖా వారి ఆచారం ప్రకారం చేసుకుంటారు. ఇక్కడ వరుడు ముస్లిం.. వధువు క్రిస్టియన్..అయితే చర్చిలో.. లేదంటే మసీదులో వారి జరగాలి కానీ వారు తమ ఇద్దరి మతాల సంప్రదాయంలో కాకుండా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. అలా తమ ఆదర్శ వివాహానికి మరో కొత్త అర్థం చెప్పారు