ఏళ్ళ క్రితం నాటి వివాదాస్పద అయోధ్య కేసును పై ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వివాదాస్పద అయోధ్య స్థలం హిందువులదేనంటూ చెప్తూ, ముస్లింలకు 5 ఎకరాల భూమిని కేటాయించాలని సుప్రీంకోర్ట్ చుచించింది. సుప్రీంకోర్ట్ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న ముస్లింలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశమైంది.ఈ సమావేశాన్ని ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నారు.
సుప్రీంకోర్ట్ తీర్పు వెలువరించిన తరువాత ఓవైసీ మాట్లాడుతూ ఈ తీర్పు అసంతృప్తిగా ఉందని, మేము 5 ఎకరాలకు పోతాం చెయ్యలేదని, న్యాయం కోసం పోరాటం చేశామంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు పై రిపిటిషన్ వెయ్యాలంటూ లా బోర్డు నిర్ణయం తీసుకుంది.